– మంత్రి దామోదర రాజనర్సింహ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
టర్కీ – తెలంగాణ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆకాంక్షించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో ఇండియాలోని టర్కీ రాయబారి ఫిరాట్ మంత్రితో మర్యాదపూ ర్వకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నదని తెలిపారు. 34 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, 28 నర్సింగ్ కళాశాలలు, పారామెడికల్ కాలేజీలు వైద్యవిద్యనందిస్తున్నాయని చెప్పారు. పారామెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 74 ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా తదితరులు పాల్గొన్నారు.