బీఆర్ఎస్ పార్టీ నుంచి బిల్లా సస్పెండ్

నవతెలంగాణ – రాయపర్తి
బీఆర్ఎస్ పార్టీ నుండి జిల్లా నాయకుడు బిల్లా సుధీర్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ మండల అధ్యక్షుడు మునావత్ నరసింహ నాయక్ తెలిపారు. శుక్రవారం మండలంలోని దుబ్బ తండాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ అంతర్గత విషయాలను బహిర్గతం చేయడం, పార్టీ విధానంలో క్రమశిక్షణగా లేకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ నుండి సుధీర్ రెడ్డిని సస్పెండ్ చేసినట్లు వివరించారు. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే సస్పెండ్ చేసినట్లు చెప్పారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, మాజీ జెడ్పిటిసి రంగు కుమార్, జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పూస మధు, ఎలమంచ శ్రీనివాస్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, గజవెల్లి ప్రసాద్, చిన్నాల రాజబాబు, భాషబోయిన సుధాకర్, మధుకర్ రెడ్డి, రాజి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.