మండలంలోని శివరామపురం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకుడు నాగపురి సోమయ్య , పార్టీ మండల అధికార ప్రతినిధి తాళ్ల పెళ్లి సంతోష్ గౌడ్ కుటుంబీకురాలు పోశాల శాంతమ్మ అనారోగ్యంతో మరణించగా రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు శుక్రవారం బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు బిల్లా సుధీర్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆయనతోపాటు బిఆర్ఎస్ పార్టీ మండల బీసీ సెల్ మండల అధ్యక్షుడు చెవ్వు కాశీనాథం, తదితరులు ఉన్నారు.