పాఠశాలలో అభివృద్ధి చేసిన పనులకు బిల్లులు చెల్లించాలి..

– మేచరాజుపల్లి ఎస్ఎం సి కమిటీ మాజీ చైర్మన్ కోటగిరి కిరణ్ 
నవతెలంగాణ – నెల్లికుదురు 
విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వ పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమంలో చేసిన అభివృద్ధి పనులకు పెండింగ్లో ఉన్న బిల్లులను తక్షణమే అందించాలని మేచరాజుపల్లి ప్రభుత్వ పాఠశాల మాజీ ఎస్ఎంసి కమిటీ చైర్మన్ కోటగిరి కిరణ్ ప్రభుత్వాన్ని కోరినట్లు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల్లికుదురు మండలంలోని మెచరాజుపల్లి గ్రామంలోని యంపిపిఎస్ పాఠశాలలో 2022-23 సంవత్సరానికి గాను మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా రూ.6,50,000/- లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.అందులో 2022-23 వరకు రూ.2,31,732 /- లు నిధులు విడుదల చేశారు.చేసిన పనులకు ఇంకా మిగిలిన డబ్బులు రాక,కొంత పనులు మిగిలి వున్నాయి.కరోనా సమయం కంటే ముందు ఎస్టిమేషన్ ఎయ్యడం వలన,కరోనా తరువాత వస్తువుల ధరలు పెరిగి నష్టమని తెలిసి కూడా మన ఊరు – మన బడి, మన పిల్లలు అనే ఉద్ధేశ్యంతో అందినకాడల్లా అప్పు తెచ్చి. నాణ్యత ప్రమాణాలతో అభివృద్ధి చేశాం.కానీ ఇంతవరకు మిగిలిన బిల్లులు రాక.కొన్ని పనులు అసంపూర్తిగా మిగలడంతో పిల్లలు సైతం ఇబ్బంది పడుతున్నారు.కంకర,ఇసుక, ఐరన్ వంటి పనికోసం అక్కడ వుంచిన మెటీరియల్ గుర్తుతెలియనివ్యక్తులు ఎత్తుకెళ్ళడం,అప్పు ఇచ్చిన వాళ్ళు ఇబ్బంది పెడతుండడంతో ఇటు ఆర్థికంగా,మానసికంగా క్షోభకు గురవుతున్నం.కావున ప్రజాప్రతినిధులు, అధికారులు సకాలంలో స్పందించి మిగిలిన నిధుల విడుదల చేసేలా కృషి చేయాలని కోరుతున్నామని అన్నారు .