కాంగ్రెస్ పార్టీ ఎస్సీ.  సెల్ గ్రామ శాఖ అధ్యక్షునిగా బింగి రవి

– కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు జేల్లా యాకయ్య
నవతెలంగాణ-నెల్లికుదురు : కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ గ్రామ శాఖ అధ్యక్షునిగా మండలంలోని బ్రాహ్మణ కొత్తపెళ్లి గ్రామానికి చెందిన బింగి రవి ని నియమించినట్లు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు జిల్లా యాకయ్య తెలిపాడు మండల కేంద్రంలోని వైస్ ఎంపీపీ జిల్లా వెంకటేష్ చేతుల మీదుగా నియమక పత్రాన్ని బుధవారం అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో బింగి రవి వారి కుటుంబం గతంలో నుండి కాంగ్రెస్ పార్టీ అని అన్నారు పార్టీ అభివృద్ధి కార్యక్రమాల్లో వారి కుటుంబం భాగస్వాములై పార్టీ అభివృద్ధికి కృషి చేశారని అన్నారు బింగి రవి కూడా జరుగుతున్న ఎన్నికల్లో ముందుండి చురుకైన వ్యక్తిగా కొనసాగినందున అతని గుర్తించి బ్రాహ్మణ కొత్తపెళ్లి గ్రామ ఎస్సీ సెల్ గ్రామ అధ్యక్షునిగా బింగి రవిని నియమిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా నూతన ఎస్సీ సెల్ గ్రామ అధ్యక్షుడు బింగి రవి మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలకు నిరంతరం కృషి చేస్తానని అన్నారు దళితుల ఎలాంటి ఇబ్బందులు వచ్చిన వెంటనే అక్కడ కి వెళ్లి ఆ సమస్యను పరిష్కరించేందుకు నా వంతు కృషి చేస్తానని అన్నారు ఎస్సీల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడుతానని అన్నారు  నా నియామకానికి సహకరించిన గ్రామ మండల జిల్లా నాయకులకు కృతజ్ఞతలు అని అన్నారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోగుల అశోక్ యాదవ్ నాయకులు జీలకర్ర యాలాద్రి దాసరి ప్రకాష్ తాళ్ల చిన్న ప్రభాకర్ పెరుమాండ్ల శంకర్ పెరుమాండ్ల శ్రీధర్ గాదే అజయ్ నవీన్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.