ఏఐపీబీఏతో బింగో భాగస్వామ్యం

హైదరాబాద్‌ : దేశంలో పికిల్‌బాల్‌ క్రీడకు ప్రాచుర్యం కల్పించడానికి గాను ఆల్‌ ఇండియా పికిల్‌బాల్‌ అసోసియేషన్‌ (ఏఐపీబీఏ)తో ఒప్పందం కుదర్చుకున్నట్లు ఐటీసీ ఫుడ్స్‌ స్నాకింగ్‌ బ్రాండ్‌ అయిన బింగో తెలిపింది. ఐదేండ్ల పాటు తమ భాగస్వామ్య మద్దతు ఉంటుందని వెల్లడించింది. ఈ ఒప్పంద కార్యక్రమంలో ఐటీసీ ఫుడ్స్‌ మార్కెటింగ్‌ హెడ్‌ సురేష్‌ చంద్‌, ఏఐపీబీఏ అధ్యక్షుడు అరవింద్‌ ప్రభు, ప్రముఖ కామెంటర్‌ మందిరా బేడీ పాల్గొన్నారని పేర్కొంది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్థి చెందుతున్న క్రీడలలో ఒకటైన పికిల్‌బాల్‌ వృద్థికి మద్దతు ఇవ్వడంలో బింగో నిబద్దతను కలిగి ఉందని సురేష్‌ చంద్‌ పేర్కొన్నారు.