కోతకు గురైన బినోల రోడ్డు..

నవతెలంగాణ -నవీపేట్: మండలంలోని ఆశాజ్యోతి కాలనీ నుండి బినోల వెళ్లే గురువారం కోతకు గురైంది. బుధవారం రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్డుపై నుండి నీళ్లు పారుతుండడంతో రోడ్డు సగానికి పైగా కోతకు గురైంది. దీంతో స్థానిక సర్పంచ్ రవి రక్షణ చర్యలో భాగంగా అటువైపు వెళ్లకుండా కంచె ఏర్పాటు చేశారు. బినోల వెళ్లే ప్రయాణికులు అటువైపు వెళ్ళవద్దని ఈ సందర్భంగా సూచించారు.