ఫిబ్రవరిలో బయోఏషియా సదస్సు

హైదరాబాద్‌: ఫిబ్రవరి 26 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు బయోఏషియా సదస్సు జరగనుంది. బయేఏషియా-2024 సదస్సు 21వ ఎడిషన్‌ను హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఏర్పాటుచేస్తున్నారు. దీనికి హెల్త్‌కేర్‌, లైఫ్‌ సైన్సెస్‌ రంగాలకు చెందిన అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొనే ఈ సదస్సు సన్నాహాలను తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు గురువారం సమీక్షించారు. బయో ఏషియా సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత పెరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.