బీఅర్ఎస్ యాకుత్ పుర నియోజక వర్గం అభ్యర్థి సామ సుందర్ రెడ్డి బయోడేటా..

నవతెలంగాణ – ధూల్ పేట్ 
యాకుత్ పుర నియోజక వర్గం బీఅర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నియోజక వర్గం బీఅర్ఎస్ ఇంచార్జీ సామ సుందర్ రెడ్డిని నియమితులయ్యారు. నియోజక వర్గంలో పార్టీ ఆరంభంలో నుండి గత ఎన్నికల్లో రెండు సార్లు పోటీ చేశారు. ఎంఐఎం కంచు కోటగా ఉన్న నియోజకవర్గంలో గట్టి పోటీ ఇచ్చి రెండవ స్థానం దక్కించుకున్నారు. నియోజక వర్గంలో ని అన్ని వర్గాల ప్రజలకు ప్రజా సంక్షేమ పథకాలు అందజేస్తూ ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నామని గౌళిపుర అధ్యక్షులు సీఎం ప్రవీణ్ రాజుతో కలిసి ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అధిష్టానం ఇచ్చిన నమ్మకంతో ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
బయోడేటా..
  పేరు  : సామ సుందర్ రెడ్డి
  తండ్రి : సామ శంకర్ రెడ్డి .
  పుట్టిన తేదీ : 24/4/1978
  అధ్యయనం: ఇంటర్మీడియట్
  భార్య : సామ స్వప్న సుందర్ రెడ్డి,
 జీహెచ్ఎంసీ
 మాజీ కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు.
  కొడుకు: సామ చరణ్ రెడ్డి, సామ శ్రీహన్ రెడ్డి
  చిరునామా: మాలారెడ్డి కాంప్లెక్స్.  కేశవ్ నగర్.
                 సాగర్ రోడ్.  చెంపపేట్.హైదరాబాద్.