అటవీ సముదాయంతోనే జీవజాలం మనుగడ..

– మండలం పరిషత్ ఆద్వర్యంలో వన మహోత్సవం..
– హాజరైన తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్.
నవతెలంగాణ – అశ్వారావుపేట
అటవీ సముదాయం తోనే జీవజాలం మనుగడ ఉంటుందని,జీవజాలం ఉనికి అక్కడ నుండే అభివృద్ధి అయిందని తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్ అన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వం లోని తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది తలపెట్టిన 75 వన మహోత్సవాన్ని మండల పరిషత్ ఆద్వర్యంలో శనివారం తహశీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ వన మహోత్సవానికి పేలాయి గూడెం ప్రత్యేక అధికారిగా ముఖ్య అతిథిగా హాజరు అయిన ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ శ్రీనివాస్,ఈజీ ఎస్ ఏపీ వో నరేష్,అశ్వారావుపేట ఈఓ హరిక్రిష్ణ,పేరాయిగూడెం కార్యదర్శి శ్రీరామమూర్తి,డి.టి సుచిత్ర,సీడీ పీఓ రాధారాణి,ఆర్ఐ క్రిష్ణ,ఆర్ఏ మన్నే రమేష్ లు పాల్గొన్నారు.