గురుపల్లిలో ఘనంగా బీరప్ప పట్నాలు 

నవతెలంగాణ – ధర్మారం 

మండలం లోని గురుపల్లి గ్రామంలో ఘనంగా ఒగ్గు పూజారులు బుధవారం రోజున బీరప్ప పట్నాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా ప్రాథమిక సహకార సంఘా ల ఫోరం అధ్యక్షులు ముత్యాల బలరాం రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా యాదవ సంఘం ఆధ్వర్యంలో బలరాంరెడ్డిని ఘనంగా శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో యాదవ కుల సంఘం పాలకవర్గం కుల పెద్దలు, నాయకులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.