కవ్వాల్ అభయారణ్యంలో 13,14న బర్డ్ వాక్..

నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలంలోని కవ్వాల్ అభయారణ్యంలో బర్డ్ వాక్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని జన్నారం ఫారెస్ట్ డివిజన్  ఇన్ఛార్జ్ ఎఫ్ ఆర్ ఓ   సుష్మారావు మంగళవారం ఒక ప్రకటనలో   తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే డిసెంబర్ 13, 14 తేదీల్లో బైసన్ కుంట, బర్తనపేట్ బేస్ క్యాంపుల వద్ద బర్డ్ వాక్ నిర్వహిస్తున్నామన్నారు. పర్యాటకులు అరుదైన పక్షులు, మొక్కలను వీక్షించే అవకాశం ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు రూ.2000 ఫీజు చెల్లించి కార్యక్రమంలో పాల్గొనవచ్చని సూచించారు. పక్షి ప్రేమికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వచ్చిన పక్షి ప్రేమికులకు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం  తాము ఏర్పాటు చేస్తామన్నారు.