బీర్కూర్ పిఆర్టియు అధ్యక్షుడిగా దుర్గాప్రసాద్

Birkoor PRTU President Durga Prasadనవతెలంగాణ – నసురుల్లాబాద్ 
బీర్కూర్ మండల పరిధి పిఆర్టియు సర్వసభ్య సమావేశం జరిగింది. గురువారం సాయంత్రం బీర్కూర్ మండల కేంద్రంలో పిఆర్టియు సభ్యులతో సమావేశం నిర్వహించారు.ఇందులో మండల పిఆర్టియు కార్యవర్గం ఎన్నిక నిర్వహించాలని తీర్మానం చేశారు. ఈ ఎన్నికకు ఎన్నికల పరిశీలికులుగా జిల్లా పిఆర్టియు అధ్యక్షులు దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కుశాల్ అధ్వర్యంలో లో నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. ఈ నూతన కార్యవర్గంలో  గౌరవ అధ్యక్షుదుగా ,వి, దుర్గాప్రసాద్ , కార్యదర్శిగా, వై నాగరాజ్, అసోసియేట్ అధ్యక్షుదుగా సయ్యద్ హాజీ, ఉపాధ్యక్షురాలుగా సుమలత, కార్యదర్శిగా ఎస్ రాజు లను ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. నూతన కార్యవర్గ అధ్యక్షులను సభ్యులను పిఆర్టియు సభ్యులు జిల్లా కమిటీ అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు. మండలంలో సుపరిచితుడైన దుర్గాప్రసాద్ మండల పిఆర్టియు మండల ప్రెసిడెంట్ కావడం తో మిత్రులు శ్రేయోభిలాషులు పి ఆర్ టి యు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.