కాంగ్రెస్‌ అగ్రనేతలను కలసిన బీర్ల ఐలయ్య

నవతెలంగాణ -యాదగిరిగుట్ట రూరల్‌
అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గేని ఢిల్లీలో బుధవారం, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా అధ్యక్షుడు అండెం సంజీవ రెడ్డి, టిపిసిసి ప్రధాన కార్యదర్శి, ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి బీర్ల ఐలయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, కాంగ్రెస్‌ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ (సీఈసీ)మెంబర్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని బీర్ల ఐలయ్య కలిశారు.