కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా, వైద్య రంగానికి పెద్దపీట: ప్రభుత్వ వీప్ బీర్ల ఐలయ్య

– గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలను విస్తరించడమే ప్రభుత్వ లక్ష్యం
నవతెలంగాణ – బొమ్మలరామారం
మారుమూల గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలను విస్తరించడమే పల్లె దవఖానాల ఉద్దేశమని అందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. మంగళవారం మండలంలోని రామలింగంపల్లిలో రూ.20 లక్షల నిధులతో నిర్మించిన పల్లె దవఖానను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య  మాట్లాడుతూ.. మారుమూల గ్రామీణ పేద ప్రజలకు నాణ్యమైన కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కృత నిశ్చయంతో  ఉందని ఆయన అన్నారు గత పాలకుల నిర్లక్ష్యం వల్ల విద్యా , వైద్య రంగం ఎంతో వెనుకబడిందని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వైద్య రంగానికి పెద్దపీట వేస్తుందని ఆయన అన్నారు ఈ సందర్భంగా రామలింగంపల్లికి చెందిన యాదవులు రామిలింగంపల్లి గ్రామ పరిధిలో ఉన్న కెమికల్ కంపెనీలు వదులుతున్న విషపదార్థాల వల్ల కలుషితమైన నీరు చెరువులలో కలవడం వల్ల తమ మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయని తక్షణమే విచారణ జరిపి విష పదార్థాలను కలుషితమైన నీటిని వదులుతున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తక్షణమే విచారణ జరిపించి విష పదార్థాలను వదులుతున్న కెమికల్ కంపెనీలపై చర్యలు తీసుకునే విధంగా అధికారులకు ఆదేశాలు ఇస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో  స్థానిక ఎంపీటీసీ సభ్యులు  హేర్వ హేమంత్ రెడ్డి తాజా మాజీ సర్పంచ్ యాంజాల కళ, మండల వైద్య అధికారి శ్రావణ్, నాయకులు బొల్లం పల్ల శ్రీనివాస్ రెడ్డి, మోకుమధుసూదన్ రెడ్డి, రామిడి రాంరెడ్డి, దేశెట్టి చంద్రశేఖర్, రామిడి శ్రవణ్ ప్రసాద్ రెడ్డి, బొబ్బిలి నర్సిరెడ్డి, నేలుట్ల వెంకటేష్, నాగరాజు, రాజేష్ పైలెట్, రాంపల్లి మహేష్ గౌడ్, ముద్దం శ్రీకాంత్ రెడ్డి, కవిత, సునీత,తదితర నాయకులుతో పాటు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.