హైదరాబాద్ : ఆదిత్య బిర్లా గ్రూప్ తమ కొత్త డెకరేటివ్ పెయింట్స్ బ్రాండ్ ”బిర్లా ఓపస్” సేవలను ప్రారంభించినట్లు ఆ సంస్థ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా తెలిపారు. దీంతో వచ్చే మూడేళ్లలో రూ.10,000 కోట్ల ఆదాయాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. బిర్లా ఓపస్ వ్యాపారాన్ని గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ గ్రాసిమ్ ఇండిస్టీస్ లిమిటెడ్ చూస్తుందని తెలిపారు. వచ్చే మార్చి మధ్య నుండి పంజాబ్, హర్యానా, తమిళనాడులో బిర్లా ఓపస్ ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయని.. జులై నాటికి భారతదేశంలోని ప్రతి లక్ష జనాభా కలిగిన పట్టణాలకు విస్తరించనున్నామన్నారు.