సీసీ రోడ్డు నిర్మాణం కోసం బీర్ల ఐలయ్యకు వినతి..

నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 
యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట సోమవారం, సీసీ రోడ్డు నిర్మాణం చేయాలని కోరుతూ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్, పీఏసీఎస్ డైరెక్టర్ యేమాల ఏలేందర్ రెడ్డి కలిసి వినతి పత్రం అందజేశారు. ఆటో స్టాండ్ నుంచి యూత్ క్లబ్ వరకు ప్యార్లల్  సీసీ రోడ్డు ఏర్పాటు చేసి రాకపోకలను సులభతరం చేయాలని కోరారు. ప్రభుత్వ విప్ సానుకూలంగా స్పందించి నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారని యేమాల ఏలేందర్ రెడ్డి  తెలిపారు.