నవతెలంగాణ – నెల్లికుదురు
జాతీయ మాల మహానాడు నెల్లికుదురు మండల అధ్యక్షుడు కారం ప్రశాంత్ జన్మదిన వేడుక ఘనంగా నిర్వహించినట్లు జాతీయ మాల మహానాడు జాతీయ కార్యదర్శి ఆశాద భాస్కర్ తెలిపారు. మండల కేంద్రంలోని మాల మహానాడు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకొని సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాలల హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తున్న వ్యక్తి అన్నారు. అంతే కాకుండా బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేసి ఆ గ్రామంలో వార్డు సభ్యుడిగా ఎన్నికై అవార్డును అన్ని రంగాలుగా అభివృద్ధి చేసిన వ్యక్తి అని అన్నారు. అనంతరం నూతనంగా విధుల్లో చేరిన ఎస్సై రమేష్ బాబుకు భుకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా వృద్ధులకు పండ్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొటిమంచి భిక్షపతి,మయ్య వెంకన్న,పత్తి దర్గయ్య గార సాయిలు, బచ్చు సత్తయ్య,గార రామచంద్రు, బాణాల సంజీవ,మయ్య రాంబాబు,గార సమ్మయ్య,బూర్గుల యకయ్య, బేతమల్ల వెంకటయ్య,కటమల్ల వెంకన్న, గార అనిల్,గార శ్రీను,మయ్య సందీప్,బింగి యాదగిరి,గార పవన్ గార అమీన్ ఇర్రి కృష్ణ,గార ఐలయ్య తదితరులు పాల్గొన్నరు.