పోలీస్ స్టేషన్ లో జన్మదిన వేడుకలు..

Medak
– ఎస్ఐ జన్మదిన వేడుకలు నిర్వహించిన రాజకీయ పార్టీల నాయకులు
నవతెలంగాణ-బెజ్జంకి 
పోలీస్ స్టేషన్ లో రాజకీయ పార్టీల నాయకులు జన్మదిన వేడుకలు నిర్వహించడం పరిపాటిగా మారింది.శుక్రవారం పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ చాంబర్ యందు ఎస్ఐ క్రిష్ణారెడ్డి జన్మదిన వేడుకలను మండల పరిధిలోని దాచారం గ్రామానికి చెందిన అయా రాజకీయ పార్టీల నాయకులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్ఐ కేక్ కట్ చేశారు.అయా రాజకీయ పార్టీల నాయకులు ఎస్ఐకి స్వీట్ తినిపిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.అయా రాజకీయ పార్టీల నాయకులు పోలీస్ స్టేషన్ లోని ఎస్ఐ కార్యాలయంలో జన్మదిన వేడుకలు నిర్వహించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో మండలంలో చర్చనీయాంశంగా మారింది.పోలీస్ స్టేషన్ అవరణంలో జన్మదిన వేడుకలు నిర్వహించడం రాజ్యాంగ వ్యతిరేకమని తెలిసిన అయా రాజకీయ పార్టీల నాయకులు విస్మరించడం గమనార్హం.పోలీస్ స్టేషన్ యందు ఎస్ఐ కార్యాలయంలో జన్మదిన వేడుకలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకుడిని పోన్ ద్వారా వివరణ కోరగా పోలీస్ అవరణం బయట ఎస్ఐ జన్మదిన వేడుకలు నిర్వహించామని దాటవేసే దోరణి అవలంబించాడు.అయా రాజకీయ పార్టీల నాయకులు ఎస్ఐ కార్యాలయంలో జన్మదిన వేడుకలు నిర్వహించిన తీరుపై సంబధిత జిల్లా పోలీస్ అధికారులు స్పందిస్తారా?లేకా చూసిచూడనట్టు వ్యవహరిస్తారా వేచి చూడాల్సిందే