నవతెలంగాణ – దుబ్బాక
దుబ్బాక మున్సిపాల్టీ పరిధిలోని లచ్చపేట మోడల్ స్కూల్ లో పదో తరగతి చదువుతున్న యశ్వంత్ తన జన్మదిన సందర్భంగా మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణ కోసం చేసిన ప్రయత్నం పలువురికి ప్రేరణగా నిలుస్తుందని ఇంచార్జ్ ప్రిన్సిపాల్ రాదారి నాగరాజు అన్నారు. మంగళవారం తన పుట్టినరోజు సందర్భంగా పాఠశాలకు 18 రకాల పూలు,పండ్ల మొక్కలను అందించాడన్నారు. ఈ సందర్భంగా విద్యార్థి యశ్వంత్ ను పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందిస్తూ పుస్తకాన్ని బహుకరించడం జరిగింది. ప్రకృతిని కాపాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఉపాధ్యాయులు జ్యోతి,సుమన్,లత,నరేష్,యాదిలక్ష్మి,కళ్యాణి,కల్పన,రాజు ఉన్నారు.