రావిచెట్టుకు పుట్టినరోజు వేడుకలు

నవతెలంగాణ-తలకొండపల్లి
మండల కేంద్రంలో ఆదివారం హరితహారంలో నాటి న మొక్కకు పుట్టినరోజు వేడుకలు మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో 2016వ సంవత్సరంలో హరి తహారం కార్యక్రమంలో భాగంగా స్థానిక జర్నలిస్టు బోల యాదగిరి నాటిన రావి చెట్టుకు పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమానికి మాజీ ఎంపీపీ లక్ష్మీదేవి, మాజీ జడ్పీటీసీ నరసింహ నాయకులు విచ్చే శారు. ఈ సందర్భంగా ముందుగా రావి చెట్టుకు పూజలు నిర్వహించి కేక్‌కట్‌ చేసి పంచి పెట్టారు. ప్రతి ఒక్కరూ మొ క్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలు పునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం మొక్క లన్ని నేడు మహావృక్షాలుగా మారాయని పోలీస్‌స్టేషన్‌ ఆవ రణలోని ఏడేండ్ల కిందనాటిన మొక్క నేడు వందలాది మందికి నీడనిస్తుందన్నారు. కార్యక్రమంలో ఏఎస్‌ఐ సీతా రాంరెడ్డి, నాయకులు శ్రీశైలం, వెంకటరెడ్డి, విష్ణు, శ్రీని వాస్‌, మహేష్‌, బాలరాజ్‌, శేఖర్‌, స్థానిక నాయకులు శ్రీను, వెంకటేష్‌, జంగయ్య, రాములు, పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.