కాంగ్రెస్ సీనియర్ నాయకుని జన్మదిన వేడుకలు

– 2002 – 2003 ఎస్ఎస్ సీ బ్యాచ్ పూర్వ విద్యార్థులు
నవతెలంగాణ – నెల్లికుదురు
ఉమ్మడి నెల్లికుదురు మండలంలోని ముప్పారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కారుపోతుల మహేష్ గౌడ్ 36వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు 2002- 2003 ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థులు తెలిపారు సోమవారం ముప్పారం గ్రామంలో ఆయన జన్మదిన వేడుకలు పురస్కరించుకొని కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకొని పేదలకు రోగులకు పండ్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు కనకయ్య అశోక్ అనిల్ మురళి మాట్లాడుతూ.. ఆయన జన్మదిన వేడుకలను చేసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఆయన ఈ గ్రామానికి ఎంతో సేవ చేశారని రానున్న రోజుల్లో కూడా మండలానికి సేవ చేయాలని ఈ సందర్భంగా తెలిపారు. కష్టపడి అభివృద్ధి చెందే వ్యక్తి కి ఎప్పటికి మేము అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ ఎంపిటిసి  జగన్, సాయికుమార్ ప్రదీప్ వీరభద్రం రాము శ్రీనివాస్ అశోక్ ఉప్పలయ్య తో పాటు కొంతమంది ఉన్నారు.