ఘనంగా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ జన్మదిన వేడుకలు

Birthday celebrations of MLA Pawar Rama Rao Patel

– అభిమానుల మెగా రక్తదాన శిబిరం
– భారీ సంఖ్యలో తరలివచ్చిన బిజెపి కార్యకర్తలు
 నాయకులు ఏరియా ఆసుపత్రికి ఐసీయు వార్డు కోసం దాదాపు రూ.12 లక్షల రూపాయల సామాగ్రి అందజేత
నవతెలంగాణ – భైంసా
ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఉదయం వేళ నుండి ఆయన నివాసంలో బిజెపి నాయకుల, కార్యకర్తల ప్రజల సందడి అగుపడింది. మొదటిసారిగా ఎమ్మెల్యే హోదాలో జన్మదిన జరుపుకుంటున్న సందర్భంగా పెద్ద మొత్తంలో అభిమానులు వచ్చి ఎమ్మెల్యే కు శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీకి నియోజకవర్గం నుండి పెద్ద మొత్తంలో ప్రజలు రావడంతో సందడి వాతావరణం అగుపడింది.
ఎమ్మెల్యే అభిమానుల మెగా రక్త దాన శిబిరం
ఎమ్మెల్యే రామారావుపటేల్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన అభిమానులు భారీ సంఖ్యలో రక్తదానం చేశారు. ఎస్. ఎస్. జిన్నింగ్ ఫాక్టరీ లో ఏర్పాటుచేసిన మెగా రక్త శిబిరానికి విశేష స్పందన లభించింది. దాదాపు 103మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానంలో మహిళలు సైతం ముందుకు వచ్చారు. రక్త దాతలను ఎమ్మెల్యే పటేల్ అభినందించారు.
ఏరియా ఆసుపత్రిలో ఐసియు వార్డు కోసం సామాగ్రి అందజేత 
ఎమ్మెల్యే జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన కుటుంబ సభ్యులు ఏరియా ఆసుపత్రిలో ఐసియు వార్డ్, ఇతర సామాగ్రి కోసం 12 లక్షల రూపాయల 10 ఐసీయూ బెడ్స్, 15 జనరల్ బెడ్స్, 10 మల్టీపారామిటర్స్, 10 బెడ్ సైడ్ లాకర్స్, వీల్ చైర్, స్ట్రెక్చర్, 30 మంది అవుట్ పేషంట్స్ కోసం కూర్చునే సీట్ల ను అందించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రామారావు పటేల్ తో పాటు ఆయన కుమారులు డాక్టర్ సతీష్ పవార్, సందీప్ పవార్, సోదరుడు దత్తురామ్ పటేల్ తో పాటు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దాత లను ఏరియా ఆసుపత్రి సూపరిడెంట్ డాక్టర్ కాశీనాథ్, డాక్టర్ అనిల్, సన్మానించారు. ఆసుపత్రి లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యం తో తన స్వంత నిధులు వెచ్చించినట్లు వెల్లడించారు. దాతల సహకారం తో ఆసుపత్రిని అభివృద్ధి చేస్తామన్నారు…
హిందూ వాహిని నుండి బీజేపీలో చేరికలు
హిందు వాహిని జిల్లా అధ్యక్షులు రావుల రాము ఆధ్వర్యంలో 70 మంది యువకులు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సమక్షంలో బిజెపి లో చేరారు. 14 సంవత్సరాలుగా వివిధ హోదాల్లో పని చేసిన రాము రాజకీయల్లోకి రావడం శుభ పరిణామ మని ఎమ్మెల్యే అన్నారు… గజమాలతో సత్కారం .. ఎమ్మెల్యే పటేల్ అభిమానులు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకోని గజ మాలతో సత్కరించారు. అదే విధంగా భైంసా పట్టణ బిజెపి అధ్యక్షులు మల్లేష్ బైంసా ఏరియా హాస్పిటల్ లో అల్పాహారం పంపిణి చేశారు. వివేకానంద అవాసం లో బిజెపి జిల్లా సభ్యత్వ నమోదు కో ఆర్డినేటర్ సిరం సుష్మారెడ్డి చిన్నారులకు పండ్ల పంపిణి చేశారు. కార్యక్రమాల్లో మాజీ ఎంపీపీలు మాజీ జెడ్పిటిసిలు.మాజీ సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు.