ఘనంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి జన్మదిన వేడుకలు

నవతెలంగాణ – పెద్దవంగర

పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి జన్మదిన వేడుకలను మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. అనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పీసీసీ మాజీ సభ్యులు కేతిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి రాకతో నియోజకవర్గం అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ తోనే రాష్ట్రంలోని బడుగు వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రంగు మురళి గౌడ్, సీనియర్ నాయకులు దుంపల కుమారస్వామి, ముత్యాల పూర్ణచందర్, అనపురం శ్రీనివాస్ గౌడ్, బానోత్ వెంకన్న, వేముల వెంకన్న, బానోత్ సీతారాం నాయక్, ఓరుగంటి సతీష్, అనపురం వినోద్ గౌడ్, బానోత్ గోపాల్ నాయక్, చిలుక సంపత్, పవన్ తదితరులు పాల్గొన్నారు.