ఘనంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి జన్మదిన వేడుకలు

నవతెలంగాణ – పెద్దవంగర: పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి జన్మదిన వేడుకలను మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే రోల్ మోడల్ తీర్చిదిద్దుతున్నారని అన్నారు. ప్రజా సంక్షేమాన్ని పరితపించిన గొప్ప నాయకురాలు యశస్విని రెడ్డి అని కొనియాడారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి దార్శ‌నికత తో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులోను ఆమె ప్రజాసేవలో మరిన్ని ఉన్నతమైన పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం ఎమ్మెల్యే కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండి జాను, దంతాలపల్లి ఉపేందర్, సీనియర్ నాయకులు సంకెపల్లి రవీందర్ రెడ్డి, బోనగిరి లింగమూర్తి, సుంకరి అంజయ్య, రమేష్, రాంబాబు, చిలుక సంపత్, పవన్, ధనుంజయ్, చిలుక బిక్షం, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.