
మండల కేంద్రంలోని సాయికృష్ట ప్రయివేట్ ఆసుపత్రిలో రోగులకు బాలవికాస సంస్థ వ్యవస్థాపకురాలు బాలథెరిసా జన్మదిన వేడుకల సందర్భంగా ఆదివారం రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్‌లను పంపిణీ చేశారు.ఈసందర్భంగా హుస్నాబాద్ కోఆర్డీనేటర్ పిల్లి జ్యోతి సత్యనారాయణ మాట్లాడుతూ.. నిరుపేదలు ఆర్థికంగా ఎదిగేందుకు సహాకరిస్తున్న బాలవికాస సంస్థ ఆర్థిక చేయుతకు ఎంతగానో కృషి చేస్తుందన్నారు. మరిన్ని సంక్షేమ కార్యక్రమాలతో మంచి పేరు పొందాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దేవి, డాక్టర్ దయాకర్, నిర్వాహకులు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.