టిఆర్ ఫౌండేషన్ చైర్మన్ జన్మదిన వేడుకలు 

నవతెలంగాణ – చండూరు 
మండలంలోని పుల్లెంల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్  బొబ్బల సంధ్యారాణి -మురళి మనోహర్ రెడ్డి లా  కుమారుడు  బొబ్బల వెంకట్ రామ్ రెడ్డి  జన్మదిన సందర్బంగా  ఆయన అభిమానులు దర్వేశిపురంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి,నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో  లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అల్పాహారం అందజేశారు.  మండల కేంద్రంలో టి ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో ఆయన  పాల్గొని కేకు కట్ చేశారు. ఫాలోవర్స్  సహకారంతో  అందించిన 2 పాటలను వారి చేతుల మీదగా విడుదల చేశారు.  చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని వారి మిత్రుల సహకారంతో అమ్మ నాన్న అనాధ ఆశ్రమములో సుమారు 600మంది అభాగ్యులకు అన్నదాన కార్యక్రమము  నిర్వహించారు. చెరువుగట్టులోని ఆయున్ష్ భార్గవ్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమము చేపట్టారు. ఈ సందర్బంగా  బొబ్బల వెంకట్ రామ్ రెడ్డి  మాట్లాడుతూ నాపైన ఇంత అభిమానంతో ఇంత ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలిపారు. నన్ను కన్నా ఈ నేలకు నేను రుణపడి ఉంటాను, ఈ ప్రాంత అభివృద్ధి కావాలి, చేయాలనీ ఎల్లళ్ళు దాటి సేవ చేయాలనే కాంక్షతో వచ్చాను.  ఏ రాజకీయాలతో, పదవులతో సంబంధం లేదు పుట్టిన నేలకు సేవ చేయడమే  నా లక్ష్యం, అని తెలిపారు. ఈ కార్యక్రమములో  వరకాంతం రాజేష్ రెడ్డి, గోపిడి నర్సిరెడ్డి, బొడ్డు సతీష్, నకిరేకంటి లింగస్వామి,పిన్నింటి వెంకట్ రెడ్డి, భూతరాజు శ్రీహరి, పిన్నింటి నరేందర్ రెడ్డి,ఇరిగి రామకృష్ణ,పెసర్ల హరీష్, ఉయ్యాలా సత్యనారాయణ, ముక్కముల రాజు, గుండెబోయిన దిలీప్, ముక్కముల సైదులు, ఇరిగి శివ, పోలె సురేష్, పాలకూరి దశరథ తదితరులు పాల్గొన్నారు.