రెట్టింపైన ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు

– సీఎం కేసీఆర్‌ దార్శనీకతకు ఇదే రుజువు: మంత్రి హరీశ్‌
నవతెలంగాణ బ్యూరో హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌ పాలనలో ఆస్ప త్రుల్లో ప్రసవాలు రెట్టింప య్యాయని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్వీట్‌ చేశారు. దీంతో ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల విషయంలో తెలంగాణ రికార్డ్‌ సష్టించిందని చెప్పారు. సంగారెడ్డి, నారాయణపేట, మెదక్‌, జోగులాంబ గద్వాల జిల్లాల్లో 80 శాతం పైగా, మరో 16 జిల్లాల్లో 70 శాతం ప్రసవాలు ప్రభుత్వాస్పత్రుల్లోనే జరిగాయని వెల్లడించారు. 2014లో ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల శాతం 30 శాతముంటే 2022-23లో అది రెట్టింపు కన్నా అధికంగా 62 శాతానికి చేరిందన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ లో 69 శాతం డెలివరీలు చేసి చరిత్ర సష్టించిందని పేర్కొన్నారు. ఆరోగ్య తెలంగాణ సాధన కోసం సీఎం కేసీఆర్‌ దార్శనికతతో తీసుకున్న చర్యలకు ఇది రుజువని తెలిపారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలంటూ ఆరోగ్యశాఖకు అభినందనలు తెలిపారు.