ఆత్మీయ అనురాగాలతో జీవించాలి: బిషప్ జయరావు పొలిమేర

నవతెలంగాణ-ధర్మసాగర్
ప్రతి ఒక్కరు సమాజంలో ఆత్మీయ అనురాగంతో జీవించాలని ఏలూరు బిషప్ జయరావు పొలిమేర సూచించారు.బుధవారం మండల కేంద్రంలోని కీర్తిశేషులు పొలిమేర యోబు, మరియా గార్ల జ్ఞాపకార్థంగా వారు, కుటుంబ సభ్యులు నిర్మించిన నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా పూజ బలిని సమర్పించిన అనంతరం సంఘాన్ని,ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరు ఈ సమాజంలో జీవించినంత కాలం ఉన్నతమైన జీవితాన్ని జీవించాలని అన్నారు.ప్రతి ఒక్కరూ అలాంటి జీవితాన్ని సార్థకం చేసుకోవాలని సూచించారు.మానవ జీవనం గడపడం ప్రతి ఒక్కరి అదృష్టమన్నారు. ఈ లోకంలో ఒకరినొకరు గౌరవించుకుంటూ, ప్రేమానురాగాలతో జీవించడం మంచిది అన్నారు. కుటుంబాలలో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ వచ్చే కష్టనష్టాలను ఎదుర్కొంటు ముందుకు సాగాలన్నారు. అలా మా తల్లిదండ్రులు అయినా పొలిమేర యోబు, మరియా వారి జీవితాలు కొనసాగించి నన్ను ఈ గొప్ప స్థితిలో నిలిపిన ఘనత వారికి, ఆ భగవంతుడికి దక్కుతుందన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ స్టేషన్గన్పూర్ నియోజకవర్గ అభ్యర్థి సింగపురం ఇందిరా,హనుమకొండ బిజెపి పార్టీ అభ్యర్థి రావు పద్మ, గార్లను ప్రత్యేకంగా ఆశీర్వదించు, వారికోసం ప్రత్యేక ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య,గ్రామ పుర ప్రముఖులు బిరుదరాజు కాంతం రాజు, విచారణ గురువులు జోసెఫ్, స్థానిక గురువులు గంగారపు అనిల్, మాచర్ల నవీన్, గంగారపు నవీన్, గంగారపు సురేష్, ఎర్ర సురేష్, గ్రామస్తులు గంగారపు కమలాకర్,పోలుమారి గోపాల్, గంగారపు అమృత రావు, గుర్రపు ప్రసాద్, బొడ్డు లెనిన్, అంకం రాజమణి, సంఘస్తులు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.