భారత్‌కు చేదు అనుభవం!

భారత్‌కు చేదు అనుభవం!–  టోర్నీలో పోటీకి అనుమతి నిరాకరణ
న్యూఢిల్లీ : ఇటీవల వాడా విడుదల చేసిన డోపింగ్‌ గణాంకాల ప్రభావం భారత అథ్లెట్లపై పడింది. అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ క్యాలెండర్‌లో భాగంగా ది మీటింగ్‌ డి లిమోగస్‌ టోర్నీలో భారత్‌ నుంచి ముగ్గురు అథ్లెట్లు పోటీపడాల్సి ఉంది. కానీ డోపింగ్‌ శాతం భారత్‌లోనే అత్యధికంగా ఉండటంతో మన అథ్లెట్లు పోటీ పడేందుకు నిర్వాహకులు అనుమతి నిరాకరించారు. ట్రిపుల్‌ జంపర్స్‌ ఎల్డోస్‌ పాల్‌, సెల్వ ప్రభు సహా హైజంపర్‌ జెస్సె సందేశ్‌లను పోటీకి నిరాకరిస్తూ ఫ్రెంచ్‌ నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. వాడా నివేదిక ప్రకారం భారత్‌లో 3865 శాంపిల్స్‌ పరీక్ష చేయగా.. అందు లో 3.2 శాతం డోపింగ్‌ పాజిటిగా తేలాయి. డోపింగ్‌ అనుమానం కారణంగా భారత అథ్లెట్లను పోటీ కి అనుమతించని ఫ్రెంచ్‌ నిర్వాహ కులపై విమర్శలు వస్తున్నాయి. భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య అధ్యక్షుడు ఆదిలె సుమారివాల దీనిపై స్పందించాల్సి ఉంది.