బీజేపీ @ 8

– ఎంపీలు, ఎమ్మెల్యేల సంఖ్య ఒకటే
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
తాజా లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ ఎనిమిది స్థానాలను గెలుచుకుంది. గత డిసెంబరులో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలను దక్కించుకుంఇ. కాగా 2019లో నాలుగు ఎంపీ సీట్లను గెలిచిన బీజేపీ, తాజాగా ఆ సంఖ్యను రెట్టింపు చేసుకోవడం గమనార్హం. సికింద్రాబాద్‌, మల్కాజ్‌గిరి, చేవెళ్ల, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో బీజేపీ గెలిచింది. అలాగే సిర్పూర్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌, ముధోల్‌, ఆర్మూర్‌, కామారెడ్డి, నిజామాబాద్‌ అర్భన్‌, గోషామహల్‌ తదితర అసెంబ్లీ స్థానాల్లోనూ విజయం సాధించిన సంగతి తెలిసిందే.