కాంగ్రెస్ ను విమర్శించే హక్కు బీజేపీ, బీఆర్ఎస్ కు లేదు 

BJP and BRS have no right to criticize Congressనవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
రైతుల ఉసురు తీసిన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు కాంగ్రెస్ ను విమర్శించే హక్కు లేదని జేఏసీ నాయకులు విమర్శించారు. శనివారం కాంగ్రెస్ రెండు లక్షల రుణమాఫీ చేయడంపై హుస్నాబాద్ లో జేఏసీ నాయకుల సమావేశం ఏర్పాటు చేసి హర్ష వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ..తెలంగాణలో రైతులందరికీ రెండు లక్షల రుణా మాఫీ కోసం రూ.31 వేల కోట్లు కేటాయించిందన్నారు. మొదటి విడుతలో ఏడు కోట్ల రూపాయల రుణమాఫీ చేశారన్నారు. గత ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీ కోసం పది సంవత్సరాలు గడిచిన చేయలేదన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే నల్లధనాన్ని వెనక్కి ఇస్తామన్న ఆమె ఏమైందన్నారు. ప్రజాపాలన కోసం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతుల పక్షాన నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు లక్ష్మారెడ్డి, మేకల వీరన్న యాదవ్, డ్యాగాల సారయ్య, చెప్పేల ప్రభాకర్,  ప్రకాష్, ఏధుల పురం తిరుపతి , కోహేడ కొమురయ్య , మల్లేశం, రేణిగుంట బిక్షపతి, రాజగోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.