– పెండ్లి కార్డు విడుదల చేసిన కాంగ్రెస్
– కేటీఆర్ ట్వీట్‌కు కాంగ్రెస్ వినూత్న కౌంటర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కారు, హస్తం మధ్య ఎన్నికల వేడి రాజు కుంటోంది. ఆ రెండు పార్టీల మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తున్నది. ట్వీట్టర్ వేది కగా మంత్రి కేటీఆర్, టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్‌రెడ్డి విమర్శలు, ప్రతి విమర్శలు కాకపుట్టి స్తున్నాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కరెంట్ ఇవ్వడం లేదంటూ కొంత మంది రైతులు మొసలిని తీసుకొచ్చి ‘కరెంట్ ఇస్తారా.. లేదంటే సబ్‌స్టేషన్‌లో వదలాలా?” అన్న వైరల్ వీడియోను మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ వినూత్నంగా స్పందించింది. ఈ క్రమంలో బీజేపీ-బీఆర్‌ఎస్ పార్టీలు రెండూ ఒక్కటే అనే విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లడానికి కాంగ్రెస్ గట్టి కౌంటర్ ఇచ్చింది. ‘బీజేపీ- బీఆర్‌ఎస్‌ల లగ్గం పిలుపు’ పేరుతో పెండ్లి కార్డును విడుదల చేసింది. తెలంగాణ అమరవీరుల ఆత్మఘోశ అంటూ కార్డులో పేర్కొంది.
ఇప్పటికే ఆ కార్డు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. వేదిక దగ్గర నుంచి ముహూర్తం వరకు ప్రస్తావించి సెటైర్ వేసింది.