నవతెలంగాణ-బెజ్జంకి
ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతమవ్వడంతో బుధవారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం చౌరస్తా వద్ద బీజేపీ శ్రేణులు టపాసులు కాల్చి సంబురాలు జరిపారు.ప్రపంచంలో భారత దేశం అరుదైన విజయాన్ని సాధించిందని..చంద్రయాన్ ప్రయోగంలో అహర్నీశలు పనిచేసి కీలక బాధ్యతలు నిర్వహించిన ఇస్రో శాస్త్రవేత్తలకు బీజేపీ శ్రేణులు కృతజ్ఞతలు తెలిపారు.బీజేపీ నాయకులు సంగ రవి,గంప రవి గుప్తా,శీలం వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.