కేజ్రీవాల్‌పై బీజేపీ కుట్ర

– ఆప్‌ నేత సంజయ్ సింగ్‌
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను మద్యం కుంభకోణంలో ఇరికించేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు కుట్రకు తెరలేపారని ఆప్‌ నాయకులు సంజరు సింగ్‌ శుక్రవారం ఆరోపించారు. ప్రస్తుతం సంజయ్ సింగ్‌ జైలులో ఉన్నారు. ఎక్సైజ్‌ పాలసీ కేసులో అరెస్టు చేసిన సంజయ్ సింగ్‌ను ఢిల్లీలోని రోజ్‌ అవెన్యూ కోర్టులో శుక్రవారం పోలీసులు హాజరు పరిచారు. అనంతరం సంజయ్ సింగ్‌ విలేకరులతో మాట్లాడారు. ‘కేజ్రీవాల్‌ను ఇరికించేందుకు భారీ కుట్ర జరుగుతోంది.. కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేయడమే కాకుండా ఆయనకు హాని తలపెట్టేందుకు బీజేపీి నాయకులు పెద్ద స్కెచ్‌ వేస్తున్నారు’ అని సంజరు సింగ్‌ పేర్కొన్నారు. మద్యం స్కామ్‌కు సంబంధించి గత నెలలో సంజరు సింగ్‌ను ఆయన నివాసంలో ఇడి సుదీర్ఘంగా ప్రశ్నించిన అనంతరం అదుపులోకి తీసుకుంది.లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి మనీల్యాండరింగ్‌ కేసులో ప్రశ్నించేందుకు కేజ్రీవాల్‌కు ఈడీ ఇటీవల సమన్లు జారీ చేసిన నేపధ్యంలో సంజరు సింగ్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కేంద్రంలోని అధికార బీజేపీి కనుసన్నల్లోనే ఈడీి తనకు సమన్లు జారీ చేసిందని కేజ్రీవాల్‌ కూడా ఆరోపించారు. ఇదే కేసులో ఢిల్లీ మంత్రి మనీష్‌ సిసోడియా జైలులో ఉన్న సంగతి తెలిసిందే.