
నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్ : హుస్నాబాద్ బీఅర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే సతీష్ కుమార్ సమక్షంలో బీజేపీ సిద్దిపేట జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ నాగిరెడ్డి విజయ్ పాల్ రెడ్డి, ఓబిసి మోర్ఛ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి కందుకూరి సతీష్, బీజేపీ హుస్నాబాద్ పట్టణ కార్యదర్శి వేముల శ్రావణ్, బీజేవైఎం అక్కన్నపెట్ మండల ప్రెసిడెంట్ కొయ్యడ కార్తిక్ తమ అనుచరులను బీఆర్ఎస్ కండువా కప్పి ఎమ్మెల్యే సతీష్ కుమార్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి సతీష్ కుమార్ తోనే సాధ్యమని రెండు పర్యాయాలు అభివృద్ధి చేశాడన్నారు. మూడోసారి భారీ మెజారిటీతో ఆయనను గెలిపించుకోవాలని, మద్దతుగా పార్టీలో చేరామని వెల్లడించారు. రోజురోజుకు బిఆర్ఎస్ పార్టీలో ప్రతిపక్ష పార్టీలు చేరడంతో కారు జోరు పెరుగుతుంది.