నవతెలంగాణ-తొగుట
కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రజా, కార్మిక వ్యతిరేక విధా నాలను విరమించుకోవాలని సీఐటీయు మండల కన్వీనర్ వసంత డిమాండ్ చేశారు. బుధవారం అఖిల భారత సీఐటీయు డిమాండ్స్ డే సందర్భం గా మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిం చి తహసీల్దార్ వినతిపత్రం అందజేశారు. ఈ సంద ర్బంగా ఆమె మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభు త్వం మూడోసారి అధికారంలోకి వచ్చిందని, గత పదేళ్ళుగా సాగించిన సంస్కరణలు, ప్రైవేటీకరణ విధానాలను వేగవంతంగా అమలు చేసేందుకు మళ్ళీ కుట్రలు చేస్తుందని విమర్శించారు. కార్మీక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను అమలు చేస్తామని బిజె పి ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. సింగరేణి బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరణ వేలానికి పూనుకు న్నదని మండిపడ్డారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను విరమించుకో వాలని గతంలో పార్లమెంట్లో ఆమోదించుకున్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బొగ్గు బ్లాకుల వేలంను రద్దు చేయాలని, ప్రైవేటీ కరణను నిలుపుదల చేయాలని, కార్మీకులకు కనీస వేతనం రూ.26 వేలు నిర్ణయించాలని అన్నారు. స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించాలన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వారిని పర్మినెంట్ చేయా లన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బిజెపి బాటలోనే పయనిస్తున్నదని, కార్మిక వ్యతిరేక విధా నాలనే అవలంభిస్తున్నదని ఆరోపించారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమల యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గి 73 షెడ్యూల్ ఎంప్లాయిమెంట్స్ లలో పనిచేస్తున్న కార్మికులకు కొత్త జీఓలను విడు దల చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ జీఓలలో ఒక్క పైసా వేతనం పెంచలేదని, మోడీ ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలను ఆశా వర్కర్లకు నష్టదాయ
కంగా ఉందన్నారు. బిజెపి పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు పరీక్షలను పెట్టకుండా నిరాకరిం చాయని గుర్తు చేశారు. మన రాష్ట్రంలో గత 15 నుండి 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఆశాలకు వయోపరిమితి దాటిన అంగన్వాడీ టీచర్లను, ఆయాలను నామమాత్రం పరీక్షలు నిర్వహిస్తామని నిర్ణయించడం అన్యాయం అన్నారు. తక్కువ బెని ఫిట్స్ ఇచ్చి ఇంటికి పంపుతున్నారని విమర్శించా రు. కావున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే కార్మిక వ్యతిరేక విధానాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అనిత, మాధ వి, ప్రవీణ, శ్యామల, దేవమ్మ తదితర కార్మికులు ఉన్నారు.