– ఇచ్చిన హామీలు అమలు చేయాలి
– 85 శాతం పేదలకు కార్మికులకు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిపించి అన్ని రంగాల్లో భూమిలో సంపదలో వాటాలు ఇవ్వాలి
– పెరుగుతున్న ధరలు అదుపులో పెట్టాలి
– అందరికీ ఇండ్లు, గ్యాస్, రైతులకు ఇన్సొరెన్స్, రైతు రుణాలపై ఇవ్వాలని సీపీఐ(ఎం) డిమాండ్
నవతెలంగాణ వికారాబాద్ ప్రతినిధి
10 ఏండ్లలో మోడీ సర్కార్ ప్రజలకు నిరుద్యోగులకు కార్మికులకు చేసిందేమీ లేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్ వెస్లీ, రాష్ట్ర కమిటీ సభ్యులు కాడిగాళ్ళ భాస్కర్‌లు అన్నారు. వికారాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సీపీఐ(ఎం)జిల్లా నాయకులు వెంకటయ్య అధ్యక్షతన రాజ కీయ శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ..10ఏండ్లలో పేదలకు కార్మి కులకు నిరుద్యోగులకు మోడీ సర్కార్ చేసిందేమీ లేదని వారు అన్నారు. ఎన్నికల్లో మోడీ ప్రజా సమస్యలు చెప్పలేదని మాయమటలు చెప్పి తనను దేవుడు పంపిం చాడని, పాక్ ఆక్ర మిత కాశ్మీర్ భూములు కాపాడుతానని అన్నారు. ఎన్డీఏకు 400 సీట్లు కాకుండా యూత్ ప్రజలు ఎక్కువ సీట్లు ఇచ్చారు. మోడీ ఎన్నిక కమిషన్‌ను వాడు కున్నారు. 7దఫలు ఎన్నికలు జరిపారు. ఎన్డీఏను కంట్రోల్ చేయాలంటే రామాలయాన్ని వాడుకుందని అన్నారు. పాల కుల విధానాలు ఉన్నోడికి 60శాతం సంపదను అంబానీ అదానీలకు కట్టబెట్టిందని తెలిపారు. ఉచిత విద్య, వైద్యం అందరికీ సమాన వేతనాలు ఇవ్వాలని తెలిపారు. మన దేశంలో 44శాతం కుటుంబాలు గ్యాస్ వాడడం లేదన్నారు. 30 శాతం కుటుంబాలు మురికి కాలువల పక్కన నివాసాలు ఉంటున్నారని గుడారలో రేకుల షెడ్డులో ఉంటున్నారని తెలిపారు. కమ్యూనిస్టులు నిరంతరం, కార్మిక వర్గం, రైతుల పేదల కోసం పోరాటాలు ఉద్య మాలు చేస్తున్నారని తెలిపారు. ప్రశ్నించిన వారినిపై ఉప చట్టం కింద కేసులు పెడుతున్నారు. పేదలకు కార్మికులకు నిరుద్యోగులకు రైతులకు పాల కులు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దఎత్తున పోరా టా లు చేయాలని అందుకు అందరం సిద్ధం కావాలని అన్నా రు. కార్యక్రమంలో సీపీఐ(ఎం)జిల్లా ముఖ్యకర్యకర్తలు పాల్గొన్నారు.