మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న బీజేపీ

– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కాడి గళ్ళ భాస్కర్‌
– నిత్యవసర సరుకుల ధరలను పెంచి సామాన్యుడి నడ్డి విరిచిన బీజేపీ ప్రభుత్వం
– రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శోభన్‌ నాయక్‌
– సీపీఐ(ఎం) మండలస్థాయి రాజకీయ శిక్షణా తరగతులు
నవతెలంగాణ-రంగారెడ్డి డెస్క్‌
మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్న బీజేపీని తిప్పి కొట్టాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కాడి గళ్ళ భాస్కర్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శని వారం మంచాల మండల కేంద్రంలో కామ్రేడ్‌ కాచం కృష్ణమూర్తి భవన్‌లో సీపీఐ(ఎం) మండల స్థా యి రాజకీయ శిక్షణా తరగతులు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బీజేపీ పార్టీ నాయకులు మతోన్మాదాన్ని రాజకీయంగా వాడు కొని కుల, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారన్నా రు. ఈ విషయాలను ఎప్పటికప్పుడు పార్టీ శ్రే ణులు ప్రజలకు తెలుపు తూ అవగాహన కలిస్తూ మతోన్మా దాన్ని తగ్గించే విధంగా చూడాలన్నా రు. రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శోభన్‌నాయక్‌ మాట్లాడుతూ.. కేంద్ర బీజేపీ ప్రభు త్వం నిత్యవసర సరుకుల ధరలు పెంచి సామాన్య ప్రజల నడ్డివిరిచిందన్నారు. పార్టీ అధ్వర్యంలో నిత్యవసర సరుకుల ధరలు తగ్గించాలని నిరసన, ధర్నా, రాస్తారోకోలు లాంటి కార్యక్రమాలు చేయా లన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేస్తేనే ప్రజలు మన వెంట ఉంటారన్నారు. కార్య క్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పగడాల యాదయ్య, మండల కార్యదర్శి నాగిల్ల శ్యామ్‌ సుం దర్‌, జిల్లా కమిటీ సభ్యులు కర్నాటి శ్రీనివాస్‌ రెడ్డి, గొరెంకల నర్సింహ, రావుల జంగయ్య, మండల కార్యదర్శివర్గ సభ్యులు సిలివేరు రాజు, ఆర్‌.స్వా మి, మండల కమిటీ సభ్యులు పుల్లగళ్ళ గోపాల్‌, పగడాల వెం కటేష్‌, కొండిగారి బుచ్చయ్య, ఆవుల యాదయ్య, వివిధ గ్రామశాఖ కార్యదర్శిలు, పార్టీ సభ్యులు తదితరులున్నారు.