రాష్ట్రంలో బీజేపీ ఎక్కడా లేదు

mlc-kavitha-should-answer-to-the-people-of-the-country– బీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయం : ఎమ్మెల్సీ కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎక్కడా లేదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమనీ, మూడోసారి కేసీఆర్‌ ముఖ్యమంత్రి అవుతా రని స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఆమె నివాసం లో జగిత్యాల కార్యకర్తల సమా వేశంలో కవిత మాట్లాడారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే సంజరు మరింత స్ఫూర్తితో పనిచేయాలని చెప్పారు. గత ఎన్నికల్లో జగిత్యాల అడ్డపై బీఆర్‌ఎస్‌ జెండా ఎగరడం సంతోషమనిపించిందని అన్నారు. కరోసా సమయంలో విశేష సేవలందించిన సంజరు ని అభినందించారు. ఎమ్మెల్సీ రమణ సమన్వయంతో ఎమ్మెల్యే సంజరు మరోసారి అద్భుతమైన మెజార్టీతో గెలుస్తారని ఆశా భావం వ్యక్తం చేశారు. అయితే ఈ నియోజక వర్గానికి జీవన్‌రెడ్డి చేసిందేమీ లేదని ఆమె ఆరోపించారు.