– మొదటి నుంచీ నాపై కక్షపూరిత వైఖరి : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
న్యూఢిల్లీ : కేంద్రంలోని బీజేపీ సర్కారు మొదటి నుంచీ తనపై కక్షపూరిత వైఖరి ప్రదర్శిస్తున్నదని, తన పాలనకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నదని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీలో తనను పాఠశాలలు, ఆస్పత్రులు కట్టకుండా అడ్డుకున్నదని విమర్శించారు.
వాళ్ల పిల్లలతో సామానంగా సామన్యుల పిల్లలు కూడా చదువుకోవడం బీజేపీ పాలకులకు అస్సలు ఇష్టంలేదని కేజ్రీవాల్ మండిపడ్డారు. బీజేపీ కుట్రలను ఎదుర్కొంటూ ఢిల్లీలో పరిపాలన ఎలా కొనసాగిస్తున్నానో తనకు మాత్రమే తెలుసని ఆయన చెప్పారు. అందుకుగానూ తనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని వ్యాఖ్యానించారు.ఓ బహిరంగసభలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. బీజేపీ అఘాయిత్యాలను ఎదిరిస్తూ ఢిల్లీ ప్రభుత్వాన్ని నడుపుతున్న నాకు మీరే నోబెల్ బహుమతులని ప్రజలను ఉద్దేశించి అన్నారు. ఢిల్లీలో ఏ గల్లీకి వెళ్లినా మేం మిమ్మల్నే నమ్ముకున్నాం, మీరే జీవితాలను మార్చాలని జనం చెబుతున్నారని కేజ్రీవాల్ చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఢిల్లీ వాసులు సరైన సమాధానం చెబుతారని హెచ్చరించారు.