దేవున్ని ఉపయోగించుకుని బిజెపి ఓట్లడిగే ప్రయత్నం

దేవున్ని ఉపయోగించుకుని బిజెపి ఓట్లడిగే ప్రయత్నం– దేవుడు ఒకరు సొత్తు,అందరివాడు
– రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు
నవతెలంగాణ: మల్హర్ రావు.
దేవుని పెరు చెప్పుకొని బిజెపి ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తోందని రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు విమర్శించారు. బుధవారం మంథనిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, చెన్నూరు ఎమ్మెల్యే శ్రీ గడ్డం వివేక్, సినీ నిర్మాత బండ్ల గణేష్ హాజరయ్యారు.ఈ సందర్భంగా దుద్దిళ్ల మాట్లాడారు రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు ఎత్తివేసే ఆలోచన చేస్తున్నారన్నారు.దీనిపై మాట్లాడినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బిజెపి కేసు పెట్టిందని , కాంగ్రెస్ పార్టీ పక్షాన దీన్నిఖండిస్తున్నట్లుగా పేర్కొన్నారు..ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల అప్పుచేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని,కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు.పాంచ్ న్యాయ్, పచీస్ గ్యారెంటీ అనే కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టోను ఇంటింటికి ప్రచారం చేయాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు.మే 13న ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తుకు ఓటు వేసి యువకుడు గడ్డం వంశీకృష్ణ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ సందర్భంగా సినీ నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ దేశానికి ఎంతో సేవ చేసిందని, ఎన్నో ప్రాజెక్ట్ లు కట్టిందని గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబమని పేర్కొన్నారు.అంబేద్కర్ ఆశయాలు నిలబెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని వివరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు,దుద్దిళ్ల అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.