బీజేపీకి ఆ రెండే తెలుసు…

BJP knows both...– ” మతతత్వం , మత మార్పిడి”  పేరిట రాజకీయం : ఛత్తీస్‌గఢ్‌ సీఎం
రారుపూర్‌ : బీజేపీకి మతతత్వం , మత మార్పిడి అనే రెండు అంశాలే ఉన్నాయి. రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయం చేయటం బీజేపీకి అలవాటుగా మారిందని ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ బఘేల్‌ అన్నారు. కాషాయ నేతలు ఏ పనీ చేయరు, ప్రజలతో పోరాడి ఓట్లు సేకరించరు. వారి మనసులో ద్వేషం, హింస ఉన్నాయి” అని బస్తర్‌లో జరిగిన సభలో సీఎం బఘేల్‌ అన్నారు. రాష్ట్ర మాజీ సీఎం రమణ్‌సింగ్‌పై విరుచుకుపడుతూ, ”రమణ్‌సింగ్‌ హయాంలో బస్తర్‌లోని ఈ పచ్చని నేల ఎర్రగా మారింది…అన్న వ్యాఖ్యలపై సీఎం కౌంటర్‌ ఎటాక్‌ ఇచ్చారు. ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్‌ 7, 17 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఐదు రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు డిసెంబర్‌ 3న జరుగుతుంది.ఎన్నికల తేదీల ప్రకటనతో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అమల్లోకి వచ్చింది. అంతకు ముందు 2018 అసెంబ్లీ ఎన్నికలలో, 15 సీట్లు కైవసం చేసుకున్న అప్పటి అధికార బీజేపీకి వ్యతిరేకంగా 90 సీట్లలో 68 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్‌ భారీ విజయాన్ని సాధించింది.