భూమ్మీదికి వస్తే చంపేస్తా అంటున్న బీజేపీ నాయకులు..

– గంకిడి శ్రీనివాస్ రెడ్డి, తన తండ్రి, సోదరుడు ..
– మాభూమి మాకు ఇప్పించి, రక్షణ కల్పించండి..
– భూ నిర్వాసితులు ప్రభుత్వానికి వేడుకోలు..
నవతెలంగాణ – ధర్మసాగర్
భూమి మీదికి వస్తే చంపేస్తానంటూన్నా బీజేపీ నాయకుడు మాజీ మండలాధ్యక్షుడు గంకిడి శ్రీనివాస్ రెడ్డి పై ప్రభుత్వం రౌడీ షీట్ ను ఓపెన్ చేయాలని, మాభూమి మాకిప్పించి,తన నుండి మాకు రక్షణ కల్పించాలని గంధం వెంకటేశ్వర్లు, అలియాస్ వీరస్వామి, గంకిడి తిరుపతి, ముక్క రమేష్ లు ప్రభుత్వాన్ని కోరారు.శుక్రవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. మండల కేంద్రానికి చెందిన బీజేపీ నాయకులు గంకిడి శ్రీనివాస్ రెడ్డి, తన తండ్రి దామోదర్ రెడ్డి, సోదరుడు గోపాల్ రెడ్డి ఎలాంటి ఆధారాలు లేకుండా మా భూమిని ఆక్రమించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు భూమి ఉన్నదని పలుమార్లు గొడవలు జరగడంతో గ్రామ పెద్దమనుషుల సమక్షంలో సర్వే నెంబర్ల ప్రకారం ఎవరికి ఎంత ఉన్నది అన్నది కొలత ప్రకారం నడుచుకోవాలని సూచనల మేరకు పలు పంచాయతీలో తీర్మానం చేసిన మా భూమి మీదికి రాకుండా మండల సర్వే జిల్లా సర్వే నిర్వహిస్తామన్నప్పటికీ వాటిని బేఖాతరు చేస్తూ, భూములను కొలవకుండా వారిని ఆక్రమించుకుంటూ మమ్మల్ని దౌర్జన్యంగా కొట్టడం జరిగిందని వాపోయారు. మమ్మల్ని కొట్టడమే కాకుండా తను  ఒక పథకం ప్రకారం 108,100 ఫోన్ చేసి మేము వారిని కారంపొడి చల్లి వారిని కొట్టడం జరుగుతుందని సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన రీతిగా అసత్య ఆరోపణలు చేయడమే కాకుండా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని వివరించారు. తీరా పోలీస్ స్టేషన్లో సీఐ ఎస్ఐ సమక్షంలో విచారణ చేపట్టగా ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో  పోలీసులు వారిని మందలించడం జరిగింది. ఇది అదునుగా భావించి తను చనిపోతానని అసత్యపు సూసైడ్ నోట్ వ్రాసి, తన చావుకు లేని వారి పేరు కూడా అందులో మెన్షన్ చేసి మా మనోభావాలు దెబ్బ తీసే విధంగా, శారీరకంగా మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

గంగిడి శ్రీనివాస్ రెడ్డి, తన తండ్రి సోదరునుండి  మాకు ప్రాణం ఉందని, మా భూమి మాకు ఇప్పించి,మాకు రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. గంపిడి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ మడికొండ శివారు 1913c,1913d లో గల రెండెకరాల  మా భూమిని  గంకిడి దామోదర్ రెడ్డి, అతని కుమారులు శ్రీనివాస్ రెడ్డి, గోపాల్ రెడ్డి కబ్జా చేసి, మమ్మల్ని ఆ భూమి మీదికి రానివ్వకుండా మానసికంగా, ఆర్థికంగా, భౌతికంగా చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ముక్క రమేష్ మాట్లాడుతూ మండల కేంద్రంలో రోడ్డు ప్రక్కన సర్వే నెంబర్1069,1069e లో6 గుంటల ఇల్లు అడుగు స్థలం మా తండ్రిగారు ముక్క దామోదర్ గంకిడి దామోదర్ రెడ్డి నుండి ఇంద్రారెడ్డి కొనుగోలు చేసిన భూమిని లింక్ డాక్యుమెంట్స్ ప్రకారం మేము కొనడం జరిగిందని తెలిపారు. 2016లో మేము దానిపై  నిర్మాణాలు చేపట్టేందుకు వెళ్లగా మాపై గంకిడి శ్రీనివాస్ రెడ్డి దామోదర్ సోదరుడు గోపాల్ రెడ్డి దుర్భాషలాడుతూ మా అన్న గారిపై కొట్టడానికి రావడం జరిగింది అని ఆరోపించారు. ఇప్పటివరకు మమ్మల్ని ఆ భూమి మీదకు రానివ్వకుండా చాలా ఇబ్బందులకు గురి చేయడం పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారి నుండి మాకు రక్షణ కల్పించి మా భూములు మాకు ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. సమాజంలో బిజెపి నాయకులమంటూ కేంద్రం లో మా ప్రభుత్వమే ఉందని కిషన్ రెడ్డి మా వాడేనని ఇలా అనేక భూ వివాదాల్లో జైలుకు సైతం వెళ్లి న గంకిడి  శ్రీనివాస్ రెడ్డి పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని, తక్షణమే అతనిపై రౌడీషీటర్ ఓపెన్ చేయాలని ఈ సందర్భంగా వారు ముక్తకంఠంతో ప్రభుత్వాన్ని కోరుతున్నామని వివరించారు.