బలిదాన్ దివస్ లో మొక్కలు నాటిన బీజేపీ నాయకులు

నవతెలంగాణ – గోవిందరావుపేట
బీజేపీ కేంద్ర పార్టీ రాష్ట్ర పార్టీ ల పిలుపుమేరకు డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ లో కార్యక్రమం లో భాగంగా జూన్ 23 నుండి జూలై ఆరో తారీకు వరకు బూత్ స్థాయిలో మొక్కలు నాటుతున్నట్లు బీజేపీ మండల అధ్యక్షుడు మద్దిలేని తేజ రాజు తెలిపారు. శనివారం మండలం లోని 75వ బూతులో చెట్లు నాటే కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా తేజ రాజు మాట్లాడుతూ.. వర్షాకాలం కావడం మొక్కలు నాటేందుకు అనువైన సమయం ఉండడం వలన పార్టీ పిలుపుమేరకు దాదాపు అన్ని బూతు లెవెల్లో నాయకులకు మొక్కలు నాటినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రచార కార్యదర్శి రుద్రారం సురేష్ మద్దినేని శ్రీనివాసు, గజ్జి కుమార్, సుతారి అనిల్, వేముల నరేష్, వర్ధన్ కొమరయ్య, ముక్కాల వీరస్వామి, మద్దినేని రామనరసమ్మ, లకావత్ నిరోషా, గండికోట సెంచు, మద్దినేని కోహుల్ కార్యకర్తలు పాల్గొన్నారు.