రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ ఎంతో బీజేపీ నాయకులు చెప్పాలి 

BJP leaders should say that the central budget for the state is too much– కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలి 
– కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బంక చందు 
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
రాష్ట్రం ప్రభుత్వ ప్రకటించిన బడ్జెట్ పై మాట్లాడే బీజేపీ నాయకులు మన తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ ఎంత కేటాయించారో చెప్పాలని హుస్నాబాద్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బంక చందు డిమాండ్ చేశారు. శనివారం హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులు సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు రాష్ట్ర బడ్జెట్ లో నిధులు కేటాయించకపోవడంపై మంత్రి పోన్నం ప్రభాకర్ రాజీనామా చేయాలని బీజేపీ నాయకులు అనడం సిగ్గుచేటు అన్నారు. కేంద్ర బడ్జెట్ లో కనీసం తెలంగాణ పేరే లేకపోవడం పై బీజేపీ నాయకులు మాట్లాడాలన్నారు. కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్  ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం తప్ప ప్రజల కోసం ఏర్పాటుచేసిన బడ్జెట్ కాదని విమర్శించారు. తెలంగాణలో ఎనిమిది బీజేపీ ఎంపీ సీట్లు గెలిపిస్తే ఒక్క రూపాయి తెలంగాణకు తీసుకురాని దౌర్భాగ్య పరిస్థితి ఉందన్నారు. తెలంగాణకు బడ్జెట్ కేటాయించకపోవడంపై కేంద్రమంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా జిల్లా అధ్యక్షురాలు ముద్ధం లక్ష్మి, హుస్నాబాద్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ, కౌన్సిలర్ భుక్య సరోజన ,మాజీ పట్టణ అధ్యక్షులు ఆక్కు శ్రీనివాస్, వెన్నరాజు, బూరుగు కృష్ణస్వామి ,పీళ్లి తిరుపతి ,పోతుగంటి బాలయ్య ,సంఘ కుమార్, బికే నాయక్ ,గొట్టే కవిత ,బోనగిరి రజిత ,చిదురాల స్వరూప పిన్నింటి సుష్మ కుండ్ర రమాదేవి బోయిని కమలమ్మ చావుల కోటేశ్వరరావు సావుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.