
కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ హామీని అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న దానికి నిరసనగా మంగళవారం శంకరపట్నం మండల తహసీల్దార్ అనుపమకు ఓబీసీ మోర్చ మండల శాఖ అధ్యక్షుడు గౌరవేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కామారెడ్డి ఎన్నికల సభలో బీసీ డిక్లరేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని బీసీలకు ఇచ్చిన హామీ ప్రభుత్వంలోకి వచ్చిన ఆరు నెలల లోపే కులగణన చేసి బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామన్నారు.స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23 శాతం నుండి 42 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్స్, మెయింటెనెన్స్ కాంట్రాక్టులలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్నారు.
2)గొల్ల కురుమలకు అధికారంలో వచ్చిన 100 రోజుల్లోనే రెండవ దశ గొర్రెల పంపిణీ కి సంబంధించి రెండు లక్షల రూపాయలు లబ్ధిదారుని ఎకౌంట్లో వేస్తామన్న హామీ మరిచి గొల్ల కురుమలను మోసం చేశారన్నారు. 3)బీసీ సబ్ ప్లాన్ కు తగిన నిధులు మంజూరు చేసేందుకు మొదటి అసెంబ్లీ సెషన్ లోనే చట్టబద్ధమైన హోదాతో జ్యోతిరావు పూలే బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటుచేసి ఏడాదికి 20వేల కోట్ల రూపాయల చొప్పున ఐదేళ్లలో లక్ష కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి 8 నెలలు గడుస్తున్న నిధుల విషయం పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎంబీసీ కులాలకు ప్రత్యేక సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేదు.అన్ని బీసీ కులాల సమగ్ర అభివృద్ధికి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీ యువతకు చిరు వ్యాపారాలు నిర్వహించుకునేందుకు మరియు ఉన్నత విద్య కోసం వడ్డీ లేకుండా, పూచికత్తు లేకుండా పది లక్షల రుణాలు ఇస్తామని హామీ ఇచ్చి మరిచిపోయారన్నారు.ప్రభుత్వం వెంటనే వారం రోజుల్లో పై విషయాల పైన చర్యలు ప్రారంభించకపోతే లక్షల మంది బీసీలతో అన్ని కలెక్టరేట్లలో ధర్నాలు నిరసనలు దీక్షలు చేపడుతామన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండు కొమురయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు జంగ జైపాల్, ఎస్టి మోర్చ అధ్యక్షుడు బిజిలి సారయ్య, ఎస్సి మోర్చ అధ్యక్షుడు కనకం సాగర్, నాయకులు, పల్లె శివారెడ్డి, రాసమల్ల శ్రీనివాస్, గూళ్ళ రాజు, నూనెకొండల్ రెడ్డి, ప్రశాంత్, మడ్డి రాజు, తదితరులు పాల్గొన్నారు.