బీజేపీ మేనిఫెస్టో మరో జుమ్లా

బీజేపీ మేనిఫెస్టో మరో జుమ్లారాష్ట్రంలో బీజేపీ ఎన్నికల ప్రణాళిక ప్రకటించింది. అది కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేతులమీదుగా ఆవిష్క రించారు. ఈ ప్రణాళికలో ఇచ్చిన హామీలన్నీ ”ప్రధాని మోడీ ఇస్తున్న హామీలు” అన్నారు అమిత్‌షా. అందుకే ఈ ప్రణాళికను లోతుగానే పరిశీలించాలి. కేంద్రంలో పదేం డ్లుగా అధికారంలో ఉన్న పార్టీ కావటం, హామీలన్నీ ప్రధాని హామీలుగా పరిగణించాలనటంతో ప్రాధాన్యత సంతరిం చుకున్నది. ఈ సందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ ”చం ద్రునిపై మువ్వన్నెల జెండా ఎగురవేసిన బీజేపీ” అన్నారు! శాస్త్రవేత్తల ఆరు దశాబ్దాల కృషి ఫలితాన్ని బీజేపీ ఖాతాలో వేసుకోవటం చవకబారు ఎత్తుగడ. ఇదే ప్రయోగం విఫల మైనపుడు, అర్థరాత్రి, శాస్త్రవేత్తల మీద ఆగ్రహంతో రుసరుసలాడిన ప్రధాని మోడీ ధోరణి ప్రజలు ఇంకా మరచి పోలేదు. వైఫల్యమైతే శాస్త్రవేత్తలదీ, విజయమైతే బీజేపీదని చెప్పుకుంటా రన్నమాట! సోషల్‌ మీడియాలో నెటి జన్ల వ్యాఖ్యలు గమనించాలి. క్రికెట్‌ మ్యాచ్‌లో ఇండియా ఓటమితో బీజేపీ ఒక ప్రచారాస్త్రం కోల్పోయిందట! నిజ మే… గెలిచి ఉంటే అది కూడా మోడీ విజయంగా చెప్పేవారే కదా!
ద్రవ్యోల్బణం తగ్గిస్తామనీ, సింగ రేణి ఉద్యోగులకు ఆదాయం పన్ను రీయంబర్స్‌ చేస్తామనీ, వరిధాన్యం మద్దతు ధర క్వింటాల్‌కు రూ.3100 నిర్ణయించి, పంట మొత్తం కొనుగోలు చేస్తామని అమిత్‌షా అన్నారు. ఇవన్నీ తెలంగాణలో బీజేపీ గెలిస్తే చేస్తారట. ఇది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని విష యాలు కాదని అమిత్‌షాకు తెలి యదా? పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచింది కేంద్ర బీజేపీ సర్కారు. ఫలితంగానే అన్ని నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. ఆహారధాన్యాలు బడా వ్యాపారుల ప్రయోజనాలకనుకూలంగా దాచిపెట్టుకోడానికీ, ఎగుమ తికీ అవకాశం ఇచ్చింది మోడీ ప్రభుత్వమే. ఆహార సరు కుల ధరలు మరింత పెరగడానికి దారితీసింది. ఈ వాస్త వాలు దాచిపెట్టి తెలంగాణలో ధరలు తగ్గిస్తామని చెప్పటం హాస్యాస్పదం. ధాన్యం మద్దతు ధర చట్టబద్ధం చేయడానికి అంగీకరించేది లేదని మోడీ చెప్పేసారు. ఇక్కడికి వచ్చి, మద్దతు ధర గురించి అమిత్‌షా మాట్లాడుతున్నారు. పైగా పంట మొత్తం కొంటామంటున్నారు. గతేడాది ”దొడ్డు బియ్యం కొనేదిలేద”ని మొండికేసిన విషయం రైతులు మర చిపోయారనుకుంటున్నారా? పసుపు బోర్డు తంతు కూడా ఇంతే. గత పార్లమెంటు ఎన్నికల తర్వాత, పసుపు బోర్డు సాధ్యం కాదనీ, అంతకన్నా గొప్పదేదో చేస్తామని బీజేపీ ఎంపీ తప్పించుకున్నారు. ఎన్నికలు దగ్గర పడగానే, రైతుల ఒత్తిడి తట్టుకోలేక, హడావుడిగా ప్రకటించారు. ఇప్పుడు పసుపు ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ఆశ పెడు తున్నారు. ఆదాయపు పన్ను రీయంబర్స్‌మెంట్‌ ఒక్క సింగ రేణి ఉద్యోగులకు మాత్రమే చేసేది కాదు కదా!
పెట్రోలు, డీజిల్‌ మీద వ్యాట్‌ తగ్గిస్తామని మరో వాగ్దా నం. ఇది మరింత మోసపూరితం. వీటి ధరలు పెంచేది కేంద్ర ప్రభుత్వం. పెంచకుండా ఉంటే సరిపోతుంది కదా! కేంద్ర పెంచుతుందట… ఇక్కడ తగ్గిస్తుందట. చమురుపై పన్ను విధానం భిన్నమైంది. కేంద్రం పెంచినపుడు, ఆటో మేటిక్‌గా రాష్ట్ర పన్ను కూడా పెరుగుతుంది. అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ భారం మోపుతాయి. రాష్ట్రంలో వ్యాట్‌ తగ్గించాలనటం రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టటమే. ఇప్పటికే జీఎస్టీ పేరుతో వనరులన్నీ కేంద్రం గుప్పిట్లో పెట్టుకున్నది. ఇప్పుడు కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే చమురుపై పన్నులు తగ్గించాలి. ఆదాయం కోసం బడా బాబుల మీద ఆదాయం పన్ను పెంచాలి. రాష్ట్రాలకు మరిన్ని నిధులు అందుబాటులోకి తేవాలి. కానీ మోడీ ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు పన్ను 10శాతం తగ్గిం చింది. ప్రజలమీద మాత్రం పన్నుల భారం మో పింది. ఒకవైపు ఎల్‌ఐసీతో సహా ప్రభుత్వరంగ సంస్థలన్నీ ప్రయివేటుపరం చేస్తూ, నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ గురించి మాట్లాడటం ఆశ్చర్య కరం. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో 2.7లక్షల ఖాళీ పోస్టులు ఆరు నెలల్లో భర్తీ చేస్తామన్నారు. కేంద్రంలో పదేండ్ల నుంచి అధికారంలో ఉన్నారు కదా.. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులు ఎందుకు నింపలేదు? ఫిబ్రవరి3, 2022న పార్లమెంట్‌లో కేంద్రమంత్రి జితేందర్‌ సింగ్‌, రాతపూర్వకంగా ఇచ్చిన జవాబులోనే, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలలో 8,75,158 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఒప్పుకున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలలోని ఖాళీలు కలిపితే 15లక్షలు దాటుతాయి. ఇప్పటికి మరో రెండు లక్షలు కలుపుకుని 17లక్షలకు చేరి ఉంటాయి. వీరు తెలంగాణలో ఖాళీ పోస్టులు భర్తీ చేస్తామని నమ్మబలుకుతున్నారు. పేదలకు ఇండ్ల పట్టాల వాగ్దానం మరింత హాస్యాస్పదం. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకం ద్వారా 2022 డిసెంబర్‌ 31 నాటికే దేశంలో అందరికీ ఇంటి సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. ఇప్పుడు దానిగురించి దాటవేసి, మరోసారి వాగ్దానం చేస్తున్నారు. గ్యాస్‌ సిలిండర్‌ గురించి మాట్లా డుతున్న బీజేపీ దాని ధర పెంచింది మోడీ ప్రభుత్వమేనన్న విషయం చెప్పదు. పైగా సంక్షేమ పథకాలకు ‘ఉచితాలు’ అని పేరుపెట్టి, వాటికి వ్యతిరేకంగా బీజేపీ నాయకుడే కేసు వేసారు. మోడీ ప్రభుత్వం కూడా ‘ఉచితాలు’ మంచిది కాదని కోర్టుకు చెప్పింది. మరోవైపు ఇక్కడ సంక్షేమం గురించి మాట్లాడటం రెండు నాల్కల ధోరణి కదా! ప్రయి వేటు ఆస్పత్రులలో రు.10లక్షల కవరేజితో ఆరోగ్యబీమా అంటున్నారు. ఆ డబ్బుతో ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేయ వచ్చు. ప్రభుత్వ డబ్బుతో ప్రయివేటు హాస్పి టల్స్‌ను ఎందుకు మేపాలి? ఒక్క సాగునీటి ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు. రాష్ట్రానికి రావల్సిన చట్టబద్ధమైన నిధులు కూడా బిగబట్టి బకాయి పెడుతున్నారు. దేశంలో ఎన్నికల బాండ్ల పేరుతో అవినీతిని చట్టబద్ధం చేసింది మోడీ ప్రభుత్వం. ఆ నాయకులే ఇక్కడ అవినీతిపరులను జైలుకు పంపుతామని అంటున్నారు. చర్యలెందుకు తీసుకోవటం లేదని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ”చర్యలు తీసుకోవటం దర్యాప్తు సంస్థల పని, మా పని కాదు” అన్నారు అమిత్‌షా. మరోవైపు రాష్ట్రంలో అధికారంలోకి వస్తే జైలుకే అంటున్నారు. ఇక్కడ దర్యాప్తు సంస్థలను పక్కనబెట్టి జైలుకు పంపుతారా? ఇవి బ్లాక్‌మెయి లింగ్‌ ఎత్తుగడలు.
ప్రజల సమస్యల పరి ష్కారం గురించి ఏమి చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలేదు. కేంద్రం లో తమ పాలనా వైఫల్యాలు ప్రజల ముందున్నాయి. అందు కే ఒకవైపు కులాన్నీ, మరోవైపు మతాన్నీ ముందుకు తెస్తు న్నారు. బీసీని ముఖ్యమంత్రి చేస్తామన్నారు. ప్రధానమంత్రే బీసీ అని చెప్పుకుంటున్న వీరు బీసీ కులగణనకు అడ్డుపడుతు న్నారు కదా! అంతేకాదు. ఒక్క రికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే బీసీలందరూ బాగుపడతారా? పదేండ్లు కేంద్రంలో అధికారం లో ఉండి ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడని బీజేపీ, ఇప్పుడు కమిటీ వేస్తామంటు న్నది. మరో వైపు ఓట్ల కోసం దైవభక్తినీ, మతాన్నీ వాడుకుంటున్నది.
తెలంగాణ ప్రజలందరికీ ఉచిత అయోధ్య ప్రయాణం, దైవ దర్శనం, వసతి కల్పిస్తారట! దేశ ప్రజలందరూ ఇదే అడిగితే ఏం చెబుతారు? వృద్ధులకు రైల్వేలో ఉన్న సదు పాయాలు తగ్గించారు. ప్రభుత్వోద్యోగులకు పాత పెన్షన్‌ విధానం రద్దు చేసారు. ఈపీఎఫ్‌ పెన్షన్‌దారుల గోడు పట్టించుకోరు. అయోధ్య, కాశీ ప్రయాణాలకు మాత్రం వృద్ధులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తారట! తాంత్రికుల సలహాతోనే కేసీఆర్‌ తమ పార్టీ పేరు మార్చారని విమర్శ చేసారు. అదే నిజమైతే అశాస్త్రీయ నిర్ణయమే! తప్పే. కరోనా కాలంలో చప్పట్లు కొట్టాలనీ, పూలు చల్లాలనీ మోడీ బహిరంగంగానే పిలుపునిచ్చారు. ఐదువేల ఏండ్లనాడే ప్లాస్టిక్‌ సర్జరీ ఉన్నదనీ, వినాయకుడికి ఏనుగు తల అట్లానే వచ్చిందని కూడా అన్నారు. ఇంతకన్నా అశాస్త్రీయం, రాజ్యాంగ విరుద్ధం ఇంకా ఏముంటుంది? ఇప్పుడు మేనిఫెస్టో పేరుతో కూడా మతపరమైన విభజనకు ప్రయత్నిస్తున్నారు. ముస్లింలలోని బీసీల రిజర్వేషన్లు రద్దు చేసి హిందువులలోని బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు పంచుతారట. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను కూడా వక్రీకరిస్తున్నారు. హిందూ ముస్లిం కొట్లాటగా చిత్రీకరిస్తున్నారు. ఇంత చేసినా తెలంగాణలో బీజేపీ గెలవలేదని అర్ధమైంది వారికి. అందుకే ఎన్ని సీట్లొచ్చినా బీజేపీనే అధికారంలోకి వస్తుం దంటున్నారు. అదెట్లా సాధ్యమని విలేకరులు అడిగితే డిసెంబరు 3న చూడండని అమిత్‌షా అన్నారు. అంటే ఇతర పార్టీల శాసనసభ్యులను టోకుగా కొనుగోలు చేస్తా రన్న మాట. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, కర్నాటక ఎత్తుగడలు తెలంగాణలో కూడా వేయనున్నారన్న మాట. అంటే.. అధికారం కోసం విలువలన్నీ దిగజార్చి, ఏ గడ్డయినా గరవడానికి సిద్ధంగా ఉన్నట్టే కదా! తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండవల్సిందే.
ఎస్‌. వీరయ్య