బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

BJP Membership Registration Programనవతెలంగాణ – కుభీర్
కుబీర్ మండల కేంద్రంలోని శివసాయి ఆలయంలో శుక్రవారం భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు ఏశాల  దత్తాత్రి అధ్యక్షతన సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి పడిపెల్లి గంగాధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.సెప్టెంబర్ 3వ తేదీన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు.మండలంలోని  ప్రతీ గ్రామంలో ఉన్న కార్యకర్తలు బూత్ స్థాయిలో ఇంటింటికి వెళ్లి పార్టీ బలోపితం చేస్తూ. రికార్డ్ స్థాయిలో సభ్యత్వ నమోదుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బొమ్మెడి మల్లేష్, సభ్యత్వ నమోదు మండల కోఆర్డినేటర్ పండిత్ జాదవ్, బి.ఎస్.ఎన్.ఎల్ బోర్డు మెంబర్ బోడిగాం గంగ శేఖర్, సావుల మల్లన్న, కందూర్ సాయినాథ్, శంకర్, నాగభూషణ్, వినయ్, మాజీ సర్పంచులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.