మహిళ రెస్లింగ్ క్రీడాకారులకు మద్దతుగా బీజేపీ ఎంపీని అరెస్టు చేయాలి

– ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆశాలతా డిమాండ్
నవతెలంగాణ-కంటేశ్వర్
మహిళా రెజ్లింగ్ క్రీడాకారులకు నిజామాబాద్ ఐద్వా మద్దతుగా ఉంటుందని బీజేపీ ఎంపీని వెంటనే అరెస్ట్ చేయాలని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆశాలత డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం నిజామాబాద్ జిల్లాలో మహిళ రెజ్లింగ్ క్రీడాకారులకు మద్దతుగా బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ ని అరెస్టు చేయాలని దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆశలత మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మహిళలపై విపరీతమైన హింస పెరిగిందని మహిళలపై హత్యలు హత్యాచారాలకు అడ్డు అదుపు లేకుండా ఎక్కడబడితే అక్కడ విచ్చలవిడిగా మహిళలపై దాడులకు పాల్పడుతున్నారు. దేశానికి పథకాలు సాధించి పెట్టిన రెజ్లింగ్ క్రీడాకారులకే రక్షణ లేకపోతే మామూలు మహిళలకు ఏ రకంగా ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చని అలాగే విపరీతమైన ధరలు పెంచుతూ మహిళలపై ఆర్థిక భారాలు మోపుతూ అణిచివేతకు గురి చేస్తున్నారు. రెజ్లింగ్ క్రీడాకారులకు రక్షణ కల్పించి బ్రిజ్ భూషణ్ ని అరెస్టు చేయకపోతే ఐద్వా మహిళా సంఘంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మహిళలపై జరుగుతున్న అరాచకాలను దాడులను నివారించటానికి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని లేనియెడల మహిళలకు భద్రత కరువవుతుందని సమాజంలో అశాంతి అరాచకం పెరిగి అలజడలు వస్తాయని ప్రభుత్వ విధానాల్లో మార్పు వచ్చేంతవరకు మహిళలు ఐక్యంగా సంఘటిత పోరాటాలు చేయాలని అప్పుడే ఈ ప్రభుత్వాలు స్పందిస్తాయని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కార్యదర్శి బెజ్జిగం సుజాత జిల్లా అధ్యక్షురాలు అనిత జిల్లా ఉపాధ్యక్షులు కటారి లావణ్య , బొప్పిడి అనసూయ జిల్లా నాయకులు రజియా, శివరంజని ,మీరా, కళావతి, శ్రీదేవి తదితర నాయకులు పాల్గొన్నారు.